హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో జిల్లాలోని ఫేస్-2, ఫేస్-3 పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ విధానం, ఎన్నికల నియమావళి గురించి అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ నిర్వహించారు.