హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

TPT: వెంకటగిరి మండలంలోని కే. ఉప్పరపల్లి, పెట్లూరు గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీపై నమ్మకంతో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.