హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రుద్రంపేట వైసీపీ నాయకులు సస్పెండ్

ATP: అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో, రుద్రంపేట పంచాయతీకి చెందిన జీ.బాలాజీ(మాజీ వైస్ ఎంపీపీ), సురేంద్రరెడ్డి(మాజీ ఉప సర్పంచ్)లను వైసీపీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నేతలు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.