హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మున్సిపల్ చైర్ పర్సన్ సభ్యుల ప్రమాణస్వీకారం

NTR: నందిగామ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక రేపు నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్డీవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ హాజరుకానున్నారు.ఈ  కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కమిషనర్ కోరారు.