సైనిక విమానాల రాకపోకల కోసం నేపాల్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు ఆ దేశ అనుమతి కోరినట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించింది. బెంగాల్‌లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లే, అక్కడి నుంచి వచ్చే సైనిక విమానాల కోసం నేపాల్‌లోని ప్రవేశ మార్గాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతి కోరినట్లు వచ్చిన కథనాలు అవాస్తవమని తేల్చి చెప్పింది.
వార్తలు
మేము నేపాల్ అనుమతి కోరడమా?: భారత్


