హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రీ ఫాయిల్ కంపెనీలో చెలరేగిన మంటలు

RR: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ట్రీ ఫాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీ కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.