హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి నదిలో చిక్కుకుని వ్యక్తి మృతి

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి చెందాడు. రుద్రూరుకు చెందిన నీలం అనిల్ ఆదివారం ఆటోలో భక్తులను గోదావరి స్నానాలకు తీసుకువచ్చాడు. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కలిసి స్నానానికి నదిలో దిగగా ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.