హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకంపై సర్పంచ్ చొరవ

RR: శంషాబాద్ మండలం అల్లికోల్ తాండలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదుపై సర్పంచ్ రవీందర్ ప్రత్యేక చొరవ చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాన్ని అర్హులైన కుటుంబాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకుని సంక్షేమ ఫలాలు పొందాలని కోరారు.