చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్నివాల్లో అరుదైన వింటేజ్ కార్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పాత తరం వైభవాన్ని, ఆటోమొబైల్ రంగం పరిణామక్రమాన్ని కళ్లకు కట్టేలా వింటేజ్ అండ్ క్లాసిక్ క్లబ్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 ఏళ్లకు పైబడిన అన్నీ వాహనాలను ప్రదర్శించారు. వీటితో పాటు ఉంచిన 101 ఏళ్ల నాటి అస్టిన్ చమ్మీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వార్తలు
101 ఏళ్ల నాటి కారును చూశారా?


