హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేతంచెర్లలో వైసీపీ విజయోత్సవ ర్యాలీ

NDL: బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థి దూదేకుల దస్తగిరితో పాటు 18 వార్డుల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసీపీ మండల నాయకులు తెలిపారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.