హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యాల నిల్వల నమోదు తప్పనిసరి'

SS: జిల్లాలో పప్పు ధాన్యాలు, బియ్యం నిల్వల వివరాలను వ్యాపారులు ప్రభుత్వ వెబ్‌సైట్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. దిగుమతిదారులు, మిల్లర్లు, టోకు, చిల్లర వ్యాపారులు, నిల్వదారులు ప్రతి శుక్రవారం నిల్వల వివరాలు నవీకరించాలన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.