హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకాభిప్రాయంతో సర్పంచ్ ఎన్నిక

TPT: తొట్టంబేడు మండలం పొయ్య గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఉన్నం సునీతప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎన్నికల అధికారి సమక్షంలో ఆమె సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, పెద్దలు ఏకాభిప్రాయానికి రావడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో అధికారులు ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.