హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

KRNL: మూడో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు, కృష్ణగిరి నామినేషన్ కేంద్రాలను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని, 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు సిబ్బందికి సూచించారు.