హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయపట్నంలో బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

JGL: ధర్మపురి మండలం రాయపట్నం బస్టేజీ వద్ద బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు జిల్లాలకు వెళ్లే ప్రధాన కూడలిగా ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ, వాన, చలిలో రోడ్డుపక్కనే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. మంత్రి స్పందించి రాయపట్నంలో బస్టాండ్ నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.