హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామి ఆలయానికి వెండి కిరీటం బహుకరణ

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయానికి హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన బండారి శ్రీధర్-రాజశ్రీ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి 187 గ్రాముల వెండి కిరీటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దాతలను శాలువాతో ఘనంగా సన్మానించారు.