హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 25న ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

SRCL: మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల నిరుద్యోగ యువత, మహిళలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. కోనాయిపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న బుధవారం ఉదయం 10.30 గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.