హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

ADB: బేల మండలంలోని మసాలా(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బోర్గావ్ గ్రామంలో భూగర్భ జలాల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆదివారం ఇంటింటికీ వెళ్లి ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.