హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు వర్ణాన్ని సంతరించుకున్న వరి పొలాలు

MNCL: దండేపల్లి మండలం ముత్యంపేటలోని వరి పొలాలు బంగారు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పంట పూర్తిగా పక్వానికి రావడంతో వరి పైరు కోతకు సిద్ధమైంది. గాలికి ఊగుతూ బంగారు రంగులో మెరిసిపోతున్న వరి కంకులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతికందే సమయం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.