హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు

E.G: రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి DSP టీవీకే కుమార్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం ఎస్సై పి. విజయ్ కుమార్ మోర్తలో నామినేషన్ వేసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రపోజర్లను మాత్రమే లోపలికి అనుమతించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని DSP తెలిపారు.