NLR: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం రామతీర్థం సర్పంచ్ అభ్యర్థిగా చిమటా రమాదేవి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా రామతీర్థం శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్
రామతీర్థం సర్పంచ్ అభ్యర్థిగా రమాదేవి నామినేషన్


