హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు పూర్తి.. రూ.9 లక్షల బిల్లులు పెండింగ్!

VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్ మాజీ సర్పంచి శ్రావణకుమార్‌కు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.9,05,335 బకాయి ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు మేరకు ఇంఛార్జ్ డీఎల్పీవో రతన్ సింగ్ విచారణ చేపట్టి నివేదిక నమోదు చేశారు. బకాయిలను మూడు విడతల్లో చెల్లించే ప్రతిపాదన వచ్చినా తుది నిర్ణయం వెలువడలేదు. బిల్లుల చెల్లింపుపై స్పష్టత కరవైంది.