హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ

WNP: పట్టణంలోని నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో సహజ ప్రసవాల ప్రాధాన్యతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో MLA మేఘారెడ్డి పాల్గొన్నారు .MLA మాట్లాడుతూ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి సహజ ప్రసవం ఎంతో మేలు చేస్తుందని, వైద్య పరంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్ వరకు సాగింది.