హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ల పంపిణీపై ఎమ్మెల్యేకు వినతి

NZB: ఇందల్వాయి మండల మేరు కుల సంఘం నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కుట్టు మిషన్ల పంపిణీపై వినతిపత్రం అందజేశారు. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత కల్పించి, అర్హులైన కుటుంబాలకు కుట్టు మిషన్లు అందించి స్వయం ఉపాధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పుత్తూరు స్వామి, ఉపాధ్యక్షుడుశ్రీనివాస్ పాల్గొన్నారు.