ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ (DSR 11) పరిసరాలు అధ్వానంగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోయింది. పక్కనే ఉన్న డ్రైనేజీ అపరిశుభ్రంగా మారగా, విద్యుత్ తీగలు సైతం వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అపరిశుభ్రంగా ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు


