హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో రేపు బీజేపీ మహాపాదయాత్ర

కరీంనగర్‌లో రేపు బీజేపీ మహాపాదయాత్ర నిర్వహించనుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడి నితిన్‌ నబీన్‌ మహాపాదయాత్రలో పాల్గొననున్నారు. నితిన్ నబీన్ పర్యటనకు పార్టీ శ్రేణుల విస్తృత ఏర్పాట్లు చేశాయి. లక్ష మంది జన సమీకరణలో కేంద్రమంత్రి సంజయ్‌ నిమగ్నమయ్యారు. గాంధీ విగ్రహం నుంచి కమాన్ చౌరస్తా వరకు మహాపాదయాత్ర జరగనుంది. యాత్ర రూట్‌ మ్యాప్‌ను నేతలతో కలిసి బండి సంజయ్‌ పరిశీలించారు.