హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అక్షర ఎంపిక

KNR: జమ్మికుంట మండలం కోరపల్లి ZPHS విద్యార్థిని పింగిలి అక్షర రాష్ట్రస్థాయి అండర్‌-14 కబడ్డీ పోటీలకు ఎంపికైంది. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఎస్‌జీఎఫ్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించినట్లు హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నవంబర్ 22 నుంచి 24 వరకు మహబూబాబాద్ జిల్లాలో పోటీలు జరగనున్నాయి.