హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీరం గూడలో ఘనంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్టపన

SRD: అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తోగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి.