హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లచెరువులో బీడీ, సిగరెట్ అమ్మకాల నిషేధం

RR: మాడ్గుల్ మండలం నల్లచెరువులో బీడీ, సిగరెట్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు సర్పంచ్ జయమ్మ తెలిపారు. ధూమపానం అలవాటు వల్ల విద్యకు దూరమై యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై బీడీ, సిగరెట్లు అమ్మకూడదని, గ్రామాన్ని ధూమపాన రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.