హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తూరులో యువకుడిపై దారుణ దాడి

RR: కొత్తూరులో యువకుడిపై దారుణ దాడి కలకలం రేపింది. బిహార్‌కు చెందిన సూరత్ సింగ్‌పై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ సమీపంలో పడేసి వెళ్లారు. గమనించిన పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.