హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉచిత వైద్య శిబిరం

NLG: మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి పంచాయతీ వద్ద సర్పంచ్ లపంగి నర్సింహా ఆధ్వర్యములో యశోద హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వివిధ పరీక్షలు చేసి ఆరోగ్యంపై సూచనలిచ్చారు. ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి పునాదని సర్పంచ్ అన్నారు. ఉపసర్పంచ్ పొగాకు సైదులు, వార్డు సభ్యులు, పెద్దలు, వైద్య బృందం, ప్రజలు పాల్గొన్నారు. యశోదకు కృతజ్ఞతలు తెలిపారు.