హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పంచపర్వం.. ధర్మపురికి పోటెత్తిన భక్తులు

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కార్తీకమాసం ఆదివారం పంచపర్వం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయం చేశారు.