హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంపెనీ చెక్కులు భర్త అకౌంట్‌కు..!

HYD: నార్సింగిలోని ట్రాబ్రిక్స్ ఆప్టో డైనమిక్స్ సంస్థలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. సంస్థలో అడ్మిన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఉమా, కొనుగోలుదారులకు పంపాల్సిన చెక్కులను తన భర్త బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు సుమారు రూ.4.19 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించారు.