SDPT: చేర్యాల కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం(KGBV)లో ఖాళీగా ఉన్న నర్సింగ్ అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారిణి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా పాఠశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి ఆహ్వానం


