హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ సలహాపై సీటీఐ ఆసక్తికర లేఖ

బంగారం కొనొద్దని గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన సలహా లక్షలాది జ్యువెలర్లు, వ్యాపారులు, మదుపర్లను అప్పుల నుంచి కాపాడిందని సీటీఐ కృతజ్ఞతలతో లేఖ రాసింది. కిలో ధర రూ.1.90 కోట్ల నుంచి రూ.1.25 కోట్లకు(రూ.65 లక్షలు) తగ్గిందని తెలిపింది. 52 లక్షల పెళ్లిళ్ల సీజన్‌లో కుటుంబాలకు ఇది ఊరటనిచ్చిందని, నాడు వ్యతిరేకించిన వారే నేడు మోదీని ప్రశంసిస్తున్నారని, ఇకపైనా మార్గదర్శనం చేయాలని కోరింది.