ఏడు నెలల గర్భవతి అన్న నిజాన్ని దాచి పెళ్లి చేశారంటూ ఓ నవవరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడులో కలకలం రేపింగి. తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్ సమీప గ్రామ యువకుడికి, తాళయూత్తు యువతితో ఈ నెల 15న పెళ్లయింది. మరుసటి రోజే వధువు ప్రసవించగా, కడుపునొప్పి, రక్తస్రావంతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే వరుడి ఇంటి వద్ద శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా, పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టానికి పంపారు.
వార్తలు
పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం


