హైదరాబాద్: 28°C
వార్తలు

జేసీ కర్మఫలం అనుభవించక తప్పదు: పెద్దారెడ్డి

AP: మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిమ్మంపల్లి నుంచి అనంతపురం పోలీసులు ఆయనను తరలించారు. జేసీ కర్మఫలం అనుభవించక తప్పదని, మీరు చేసే ప్రతిదానికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని పెద్దారెడ్డి హెచ్చరించారు. తన ఇంటిపై 500 మందితో దాడికి వచ్చారని చెప్పారు. తనతో ఏమైనా ఉంటే నేరుగా తేల్చుకోవాలని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దని వ్యాఖ్యానించారు.