NZB: నవీపేట్ గ్రామంలోని బాసర ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి 26వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఉమ్రి సెక్షన్ ఇన్‌చార్జ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. మరమ్మతుల పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేటి నుంచి రైల్వే గేట్ మూసివేత


