NZB: భీమగల్ మండలం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం ఈ నెల 24న వైభవంగా జరగనుంది. జాతరలో రథానికి పూల తొట్లెలు కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సంతాన ప్రాప్తి, శుభాలు కలగాలని భక్తులు ఈ మొక్కులు సమర్పిస్తారు. రథోత్సవం అనంతరం ప్రతి భక్తుడికి పూల ప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు ఆదివారం తెలిపారు.
తెలంగాణ
ఘనంగా లింబాద్రిగుట్ట స్వామివారి రథోత్సవం


