హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్, కానిస్టేబుల్ పై మహిళ ఫిర్యాదు

SRPT: సూర్యాపేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్, ఏ.ఆర్ కానిస్టేబుల్ కలిసి గత కొంతకాలంగా ఫోన్‌లో వేధిస్తున్నారని బాధితురాలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈరోజు పోలీసులు తెలిపారు.