హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

వికారాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుగ్గరామేశ్వరాలయం వద్ద ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. కాగా పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి ఆటో వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతులు నాగేేష్, పార్వతమ్మ, సరిత, చంద్రమ్మగా గుర్తింపు.