జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలాన్ని ఆదివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం ఏడు గంటల వరకు పొలాలు, చెట్లు, రహదారులు పొగమంచులో మునిగిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక డ్రైవర్లు తిప్పలు పడుతున్నారు. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలని సూచిస్తున్నారు.
తెలంగాణ
ఎండపల్లిలో దట్టమైన పొగమంచు


