హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించాలి'

WNP: ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై యువత ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్వో రాంరెడ్డి అన్నారు. శనివారం వనపర్తి ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.