హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: జడ్జీ

WNP: విద్యార్థులు మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాంటి దురలవాట్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి కలార్చన అన్నారు. శనివారం స్థానిక రాక్ వుడ్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.