నిర్మల్ జిల్లా ముధోల్ పట్టణం, పరిసర గ్రామాలను ఆదివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినా తగ్గలేదు. జాతీయ రహదారిపై, నయాబాదిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. రైతులు, కూలీలు పొగమంచులోనే పొలాలకు వెళ్లారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని సూచించారు.
తెలంగాణ
ముధోల్ను కమ్మేసిన దట్టమైన పొగమంచు


