హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేదెను ఢీకొని మరో కారును ఢీకొన్న కారు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెను ఢీకొట్టగా, అది అక్కడికక్కడే మృతి చెందింది. అదుపు తప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. నలుగురు గాయపడగా, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.