హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలియో నిర్మూలనలో ప్రజల సహకారం కీలకం

MDCL: ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. పోలియో నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో డాక్టర్ ఆనంద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.