హైదరాబాద్: 28°C
వార్తలు

సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే?

AP: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల సర్పంచిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రూ.1.50 కోట్లు జమ చేస్తానని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయస్వామీజీ ప్రకటించారు. తన స్వగ్రామ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు టీడీపీ, వైసీపీ సహా ఇతర పార్టీల నేతల మద్దతు కోరతానని, గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.