KNR: మడికొండలోని ఆంధ్రజ్యోతి సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంజాల సతీశ్ అదృశ్యమయ్యారు. ఈ నెల 21న హైదరాబాద్ నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో వస్తూ మడికొండలోని కార్యాలయానికి వెళ్తానని చెప్పి బస్సు దిగారు. అయితే కార్యాలయానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కిషన్ తెలిపారు.
తెలంగాణ
ఆంధ్రజ్యోతి అకౌంటెంట్ అదృశ్యం


