హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం

ADB: నెరడిగొండ మండలంలో చలి తీవ్రత పెరిగి ఉదయం పూట కశ్మీర్ను తలపించేలా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో జాతీయ రహదారి-44పై రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డామని డ్రైవర్లు తెలిపారు. ఎన్హెచ్ఐఐ (NHAI) రోడ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.