హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెస్ ప్రతిభతో ఆకట్టుకున్న HYD చిన్నారులు

హైదరాబాద్‌లో 3 నుంచి 9 ఏళ్ల చిన్నారులు సయాన్ష్, ఇషిక, చైత్ర, మణి అస్రిత్, విహాన్ అద్భుత చెస్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. హైటెక్ సిటీలో బ్లిస్‌బర్గ్, డైమండ్ చెస్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డులే లక్ష్యంగా సత్తా చాటారు. వీరి ప్రతిభను మాజీ ఐఏఎస్ అజయ్ మిశ్రా, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి అభినందించారు.